Sunday, December 22, 2024

వర్షాలపై టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ శ్రేణులకు కాసాని పిలుపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వర్షాల సమయంలో పార్టీ శ్రేణులు జాగ్రత్తగా ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పార్టీ శ్రేణులకు టి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష భీభత్సంలో వానలు ఇప్పటికే ఏడుగురిని వానలు బలిగొన్నాయన్నారు. ఈ క్రమంలో టి టిడిపి శ్రేణులు ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

భారీ వర్షాల వల్ల గతంలో దెబ్బతిన్న మోరంచపల్లి వంటి గ్రామాలకు తెలుగుదేశం పార్టీ తనవంతు సహాయ కార్యక్రమాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు తదితర అంశాలపై ఆయన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. సెప్టెంబర్ 4 సోమవారం రోజు ఇందిరాపార్కు వద్ద టి టిడిపి నిర్వహించిన మహాధర్నా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా గ్రామాల నుండి , జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు వచ్చి ఇందిరాపార్కు మహా ధర్నాలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదములు తెలయజేస్తున్నానన్నారు.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, హైదరాబాద్ ప్రగతినగర్‌లోనూ ఒక బాలుడు నాలాలో పడి మృతి చెందడం బాధాకరమన్నారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఏమి చేస్తే బావుంటుందో ప్రభుత్వ యంత్రాంగానికి తెలపాలని, అందుకు వారిని అప్రమత్తం చేసే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు. చెరువుల దగ్గర నీరు పోకుండా అక్కడికక్కడ కాలువలు తొవ్వేశారని అవి సరిగ్గా ఉన్నాయా? లేదా? అనే దానిపై ప్రభుత్వ అధికారుల దృష్టికి తేవాలన్నారు.

వర్షాల వల్ల ఏఏ పంటలకు ఎంత నష్టం జరిగిందో పార్టీ శ్రేణులు రిపోర్టులను రాష్ట్ర పార్టీ కి పంపాలని కాసాని సూచించారు. పంట నష్ట వివరాలను ఆక్కడ స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించి తెలపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ఈ టెలికాన్ఫరెన్స్ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు ,పార్లమెంట్ కమిటీ పార్టీ అధ్యక్షులు,నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, కో-ఆర్డినేటర్లు పాల్గొన్నారని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News