Monday, December 23, 2024

కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతిపై కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి మాజీ శాసనసభ్యుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సంతాపం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్మన్ గా ఆయనతో చాలా కాలం తాను కలిసి పనిచేశానని, నేడు ఆయన లాంటి మిత్రున్ని కోల్పోవడం బాధాగా ఉందన్నారు. సుధీర్ఘ రాజకీయానుభవం ఉన్న హరీశ్వర్ రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై పరిగి ప్రాంతానికే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారని కాసాని గుర్తు చేశారు.

రాజకీయాల్లో సర్పంచ్ స్థాయి నుండి డిప్యూటీ స్పీకర్ పదవి వరకు అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగి అహర్నిశలు ప్రజల కోసం పనిచేసిన నేతగా హరీశ్వర్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. సీనియర్ రాజకీయ నేతగా ఉన్న ఆయన మరణించడం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేకించి పరిగి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అన్నారు. హరీశ్వర్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News