Monday, December 23, 2024

చంద్రబాబు అరెస్టును ఖండించిన కాసాని జ్ఞానేశ్వర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: టిడిపి అధినేత, మాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్ మెంట్  పేరుతో అక్రమంగా అరెస్టు చేయడాన్ని టిడిపి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చేతకాని వైసిపి ప్రభుత్వం టిడిపి నాయకులను అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని అన్నారు.

ఓడిపోతామని గమనించిన జగన్ రెడ్డి, బాబుని నిలువరించడానికి చేసే ప్రయత్నమే ఈ అక్రమ అరెస్ట్ అని ఆయన అన్నారు. సంబంధం లేని కేసులతో అరెస్టు చేయడం అత్యంత దారుణమని జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పే రోజు తొందరలోనే ఉందని ఈ సందర్భంగా ఆయన సంఘీభావం తెలియజేస్తూ వారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కాసాని జ్ఞానేశ్వర్ కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News