Friday, December 20, 2024

మహిళా బిల్లును స్వాగతించిన కాసాని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్వాగతించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఈ రిజర్వేషన్‌లను వాయిదా వేయకుండా వచ్చే ఎన్నికల నుంచే అమలు చేయాలని కాసాని కోరారు. దేశంలోనే మొదటి సారిగా స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్‌లను ఎన్‌టిఆర్ ప్రవేశ పెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రవేశ పెడుతున్న రిజర్వేషన్‌లలో ఆయా వర్గాల మహిళలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News