Wednesday, January 22, 2025

ఫోన్లో బ్లూ ఫిల్ములు చూసి, చెల్లెలిపైనే అత్యాచారం

- Advertisement -
- Advertisement -

పోర్న్ అందుబాటులో ఉండటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్ లో బ్లూ ఫిల్ములు చూసి యువత చెడిపోతోందంటూ తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం కొన్ని పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం విధించి చేతులు దులుపుకుంది. దాంతో నిషేధానికి గురైన వెబ్ సైట్లు మారుపేర్లతో మళ్లీ చెలామణిలోకి వస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని కస్ గంజ్ లో జరిగిన సంఘటనను గమనిస్తే పోర్నోగ్రఫీవల్ల యువత ఎంతటి దారుణాలకు తెగిస్తోందో తెలుసుకోవచ్చు.

కస్ గంజ్ కు చెందిన 19 ఏళ్ల సంజు కుమార్ అనే కుర్రాడు సెల్ ఫోన్ లో బ్లూ ఫిల్ములు చూసి, ఉద్రేకంలో తన మైనర్ చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత జరిగిన దారుణం గురించి తల్లితో చెబుతుందని భయపడి, చెల్లెలికి ఉరి వేసి చంపేసి, పరారయ్యాడు. సంజూ కుమార్ తండ్రి ఏడాది కిందట చనిపోయాడు. తల్లే పనీపాటా చేస్తూ కొడుకునీ, కూతురినీ చదివిస్తోంది. సంజూ చేసిన అఘాయిత్యం గురించి తెలుసుకున్న అతని మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంజూ కోసం గాలింపు చేపట్టిన పోలీసులకు అతను సోమవారంనాడు దొరికాడు. సంఘటన జరిగిన సమయంలో తన తల్లి ఇంట్లో లేదనీ, మొబైల్ ఫోన్ లో బ్లూ ఫిల్ములు చూసి, చెల్లెలిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఒప్పుకున్నాడు. పాటియాలా కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇంచార్జి ఇన్ స్పెక్టర్ గోవింద్ వల్లభ్ శర్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News