Monday, December 23, 2024

జాతీయ స్థాయి మహిళల హాకీ జట్టుకు కశిష్ ఎంపిక

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : గత జనవరి నెలలో రంగారెడ్డి జిల్లా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాదర్గుల్‌లో నిర్వహించినటువంటి ఓపెన్ సెలక్షన్‌లో మన జిల్లా నుంచి మంచి ప్రతిభ కనబరిచిన కశిష్ 13వ జాతీయ స్థాయి సీనియర్ మహిళల హాకీ జట్టుకు ఎంపికైందని మరియు కాకినాడలో ఈనెల 15నుండి 26వ లేదీ వరకు జరగబోయే హాకీ ఇండియా, జాతీయ స్థాయి మహిళల హాకీ టోర్నమెంట్‌లో పాల్గొంటుందని నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అధ్యక్షులు విశాఖ గంగారెడ్డి, మరియు ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలియజేశారు. మరియు ఈ అమ్మాయి ఎంపిక పట్ల ఉద్దేశించి మాట్లాడుతూ సీనియర్ మహిళల హాకీ జట్టుకు ఎంపికకావడం నిజామాబాద్ జిల్లాకు గర్వకారణమని తెలియజేశారు.

అదేవిధంగా మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఈ సందర్భంగా ఆమెను ఆశీర్వదిం చారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా హాకీ సంఘం అద్యక్షులు విశాఖ గంగారెడ్డి, జిల్లా హాకీ సంఘం ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ, కోశాధికారి పింజ సురేందర్, ఉపాధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి, నరసింహారెడ్డి, హనుమంతు, రిటైర్డ్ హాకీ కోచ్ హర్షవర్ధన్ రెడ్డి, మక్బూల్ (హాకీ కోచ్) సంయుక్త కార్యదర్శులు ఎండి. జావిద్, యండి. ఆరిఫ్, చిన్నయ్యక, కార్యనిర్వాహక కార్యదర్శి అంజు, ఈసి మెంబర్ సంతోష్, నాగేష్, సుధీర్, కత్తి శ్రీనివాస్, నవనీత్‌లు మరియు సీనియర్ క్రీడాకారులు వీరిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News