Monday, December 23, 2024

వాస్తవాన్ని ‘కాశ్మీర్ ఫైల్స్’లో చూపించాము

- Advertisement -
- Advertisement -

Kashmir files movie

 

దేశానికి తలమానికమైన కాశ్మీర్‌లో హిందూ పండితులపై టెర్రిస్టుల దాడి ఎందుకు జరిగింది? వారిని ఊచకోత ఎందుకు కోశారు? ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి? అనే విషయాలను నిక్కచ్చిగా తమ ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో చెప్పామని చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి తెలియజేశారు. దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, చిన్మయ్ మాండ్లేకర్, ప్రకాష్ బెలవాడి, పునీత్ ఇస్సార్ తదితరులు నటించిన ఈ హిందీ సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ “నేను ఈ కథ రాయలేదు. టెర్రరిజం ద్వారానే తెలుసుకొని ఈ సినిమా తీశాను. 1990 దశకంలో హిందూ పండితులను టార్గెట్ చేసి కొంత మంది టెర్రరిస్టులు ఊచకోత కోశారు. వారి పిల్లలను చంపేశారు. పెద్దలను పారిపొమ్మని భయపెట్టి, మహిళలను ఇక్కడే బందీలుగా పెట్టుకొని నరకయాతన చూపించారు. ఈ విషయాలేవీ ప్రపంచానికి తెలయనీయకుండా కొందరు దాచేశారు. అందుకే బాధ్యాయుత పౌరుడిగా నేను ఈ సినిమా తీశాను”అని అన్నారు. అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ “కాశ్మీర్ ఇండియాలో భాగం. 30 ఏళ్లుగా ఇలాంటి కథతో ఎవరూ సినిమా తీయలేదు. వాస్తవం ఏమిటనేది ఈ సినిమా ద్వారా చూపించాము”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News