Monday, December 23, 2024

600 ఏళ్ల క్రితం కశ్మీరులో ఉన్నదంతా కశ్మీరీ పండిట్లే: ఆజాద్

- Advertisement -
- Advertisement -

జమ్మూ: జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, డెమ్రోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ(డిపిఎపి) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 600 సంవత్సరాల క్రితం కశ్మీరులో కేవలం కశ్మీరీ పండిట్లు మాత్రమే ఉండేవారని, ఆ తర్వాత వారు ఇస్లాంలోకి మారారంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత వారం దోడా జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

భారతీయ ముస్లింలలో అత్యధిక శాతం మంది హిదూత్వం నుంచి మతం మారినవారేనని ఆయన వ్యాఖ్యానించారు. కొందరు ముస్లింలు వెలుపలి నుంచి భారత్‌కు వచ్చారని, మరి కొందరు ముఘల్ రాజులతోపాటు సైన్యంగా వచ్చి ఉంటారని, చాలామంది హిందువులు, సిక్కులుగా ఉండి మతం మార్చుకుని ఉంటారని ఒక బిజెపి నాయకుడు తనతో అన్నారని ఆజాద్ తెలిపారు.
ఇందుకు పెద్ద ఉదాహరణ కశ్మీరని ఆయన చెప్పారు. 600 ఏళ్ల క్రితం కశ్మీరులో ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు.

అప్పుడంతా కశ్మీరీ పండిట్లేనని, ఆ తర్వాత వారే ఇస్లాంలోకి మారారని ఆయన చెప్పారు. అయితే తన రాజకీయాలు మతం ఆధారంగా ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. తన రాజకీయాలలో మతానికి స్థానమే లేదని ఆజాద్ అన్నారు. జమ్మూ కశ్మీరు అభివృద్ధి కోసం హిందువులు, ముస్లింలు కలసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఓట్ల కోసం మతాన్ని వాడుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మత రాజకీయాలు ఎవరు చేసినా వారు బలహీనులేనని ఆయన వ్యాఖ్యానించారు. హిందువులు, ముస్లిం పేర్ల ఆధారంగా టింగ్ జరగరాదని ఆయన చెప్పారు.

https://www.google.com/search?sca_esv=558024616&rlz=1C1PRFC_enIN986IN986&sxsrf=AB5stBjTP6Qxg_ghmvBQSxpxqgN339tMlQ:1692337262467&q=Kashmir+valley+had+only+Pandits+600+years+ago:+Ghulam+Nabi+Azad&tbm=vid&source=lnms&sa=X&ved=2ahUKEwjc9fnKv-WAAxXzXGwGHWYmAL0Q0pQJegQIChAB&biw=1366&bih=625&dpr=1#fpstate=ive&vld=cid:539181a9,vid:K1njzDeHlDI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News