Sunday, December 22, 2024

కశ్మీర్ పాకిస్థాన్ లో ఎన్నటికీ భాగం కాబోదు: ఫరూఖ్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా కశ్మీర్ లో ఉగ్రవాదానికి పాకిస్థాన్ కారణం అన్నారు.  పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం ఆపాలన్నారు. ఒకవేళ ఆపకుంటే భారత్ ఆ పనిచేస్తుందన్నారు. ‘‘భారత్ తో స్నేహంగా ఉండే ప్రయత్నం చేయండి…లేకుంటే సమస్యలు తలెత్తుతాయి’’ అన్నారు. గురువారం బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రదాడి జరుగగా ఇద్దరు జవానులు, ఇద్దరు పౌరులు సహా మొత్తం నలుగురు చనిపోయారని తెలిపారు. దీనికి మూడు రోజుల ముందు ఆరుగురు భవన నిర్మాణ కార్మికులు, ఓ డాక్టరును కాల్చి చంపారన్నారు.

‘‘మనం పరిష్కార మార్గం కనుగొనేంత వరకు ఈ ఉగ్రదాడులు జరుగుతూనే ఉంటాయి. 30 ఏళ్లుగా అమాయకులను చంపేయడం నేను చూస్తూ వచ్చాను. వారెందుకు(పాకిస్థాన్ వారు) ఈ విధ్వంసానికి పాల్పడుతున్నారు. మనం పాకిస్థాన్ కు చెందిన వారం కాము.. అయినప్పటికీ వారెందుకు ఈ విధ్వంసం తలపెడుతున్నారు?’’ అని ప్రశ్నించారు. ‘‘మన తోటి వారెందరో అమలులయ్యారు.. అయినా ఈ మారణహోమం ప్రతి ఏటా కొనసాగుతున్నది. ఇలా చేస్తే కశ్మీర్..పాకిస్థాన్ లో కలుస్తుందన్న అత్యాశతో పాకిస్థాన్ వారున్నారు. ముందు వారు తమ దేశంలోని సమస్యలను చక్కదిద్దుకుంటే మంచిది. చనిపోయిన వారి కుటుంబాల విషయంలో నేను చింతిస్తున్నాను’’ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News