Wednesday, January 22, 2025

కశ్మీరీ పండిట్ల శిబిరాలను స్మశానంగా మారుస్తాం: ఉగ్రవాదులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కశ్మీరీ పండిట్ల తాత్కాలిక శిబిరాలను స్మశానంగా మారుస్తామని ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టిఆర్‌ఎఫ్) హెచ్చరించింది. కశ్మీరీ పండిట్ల కోసం నిర్మిస్తున్న తాత్కాలిక కాలనీలను వెస్ట్ బ్యాంక్‌లోని ఇజ్రేలీ శరణార్థ శిబిరాలుగా టిఆర్‌ఎఫ్ అభివర్ణించింది. మరింతమది కశ్మీరీ పండిట్లను చంపివేస్తామని, ఈ కాలనీల నిర్మాణంలో పాల్గొంటున్న కాంట్రాక్టర్లను సైతం వదిలిపెట్టబోమని టిఆర్‌ఎఫ్ హెచ్చరించింది. కాగా…జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం కశ్మీరీ పండిట్ల తాత్కాలిక కాలనీలను సందర్శించారు.

ఉత్తర కశ్మీరులోని బారాముల్లా, బండిపూరా జిల్లాలకు చెందిన ప్రధానమంత్రి ప్యాకీజి ఉద్యోగల నివాసం కోసం నిర్మిస్తున్న తాత్కాలిక గృహాల నుల పురోగతిని ఆయన పరిశీలించారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ పర్యటనపై టిఆర్‌ఎఫ్ మండిపడింది. ఆక్రమిత జమ్మూ కశ్మీరులోని ఈ కీలుబొమ్మ పాలకులు పిఎం ప్యాకేజ్ ఉద్యోగులను బలిపశువులను చేస్తున్నారని టిఆర్‌ఎఫ్ విమర్శించింది. పాలకుల కుటిల పన్నాగాలను ఆ ఉద్యోగులు పసిగట్టలేకపోతున్నారని తన హెచ్చరిక లేఖలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News