Thursday, January 23, 2025

షోపియాన్‌లో కాశ్మీరీ పండిట్‌ను చంపేసిన ఉగ్రవాదులు

- Advertisement -
- Advertisement -

Kashmir

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదుల చేతిలో ఓ పౌరుడు హతమైనట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీరీ పండిట్ అయిన పురన్ క్రిషన్ భట్ అనే బాధితుడు షోపియాన్‌లోని చౌదరి గుండ్ వద్ద పండ్ల తోటకు వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భట్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

“షోపియన్‌లోని చౌదరి గుండ్‌లోని ఒక పండ్ల తోటకు వెళుతున్న సమయంలో #ఒక పౌరుడు (మైనారిటీ) శ్రీ పురాణ్ క్రిషన్ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ #చనిపోయాడు. ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. దర్యాప్తు జరుగుతోంది” అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి హంతకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News