శ్రీనగర్: పాకిస్తాన్ అనుకూల వేర్పాటువాది, హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ లీ షా గిలాని అంత్యక్రియలు బుధవారం రాత్రి గట్టి బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. గిలానీ మృతిని పురస్కరించుకుని ముందు జాగ్రత్తగా కశ్మీరువ్యాప్తంగా మొబైల్ సర్వీసులపై ఆంక్షలు విధించారు. 91 సంవత్సరాల గిలాని మృతదేహాన్ని ఆయన ఇంటి సమీపంలోని మసీదు వద్ద ఖననం చేసినట్లు ఆయన సన్నిహిత అనుచరులు తెలిపారు. అయితే తన తండ్రి భౌతికకాయాన్ని ఈద్గా వద్ద ఖననం చేయాలని తాను ఆశించినట్లు గిలాని కుమారుడు నయీమ్ తెలిపారు. జమ్మూ కశ్మీరులో మూడు దశాబ్దాలకు పైగా వేర్పాటువాద రాజకీయాలను నెరపిన గిలాని చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి శ్రీనగర్ శివార్లలోని హైదర్పురాలోని తన నివాసంలో మరణించారు. కశ్మీరు లోయలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించడానికి కొన్ని జాతి వ్యతిరేక శక్తులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయన్న నిఘా వర్గాల సమాచారంతో ముందుజాగ్రత్తగా బుధవారం రాత్రే గిలాని అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు కోరినట్లు తెలుస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య గిలాని మృతదేహానికి సమీపంలోని మసీదుకు చెందిన స్మశానవాటికలో సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
గట్టి బందోబస్తు మధ్య హురియత్ నేత గిలాని అంత్యక్రియలు పూర్తి
- Advertisement -
- Advertisement -
- Advertisement -