Saturday, December 28, 2024

డబ్లూపిఎల్ వేలం పాట..కాష్వీ గౌతమ్‌కు రూ. 2 కోట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై: వచ్చే ఏడాది జరిగే మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) కోసం శనివారం ముంబైలో మినీ వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో భారత్‌కు చెందిన అన్ క్యాప్‌డ్ ప్లేయర్స్ కాష్వీ గౌతమ్ రికార్డు ధరను పలికింది. రూ.10 లక్షలు బేస్ ధర ఉన్న ఈ యువ ఆల్‌రౌండర్‌ను గుజరాత్ జెయింట్స్ ఏకంగా రూ. రెండు కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. కాష్వీని దక్కించుకునేందుకు యూపి వారియర్స్, గుజరాత్ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరి గుజరాత్ రెండు కోట్ల రూపాయలకు కాష్వీని దక్కించుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ అనాబెల్ సదర్లాండ్ కూడా భారీ ధరను పలికింది. రూ.30 లక్షల బెస్ ధరతో వేలం పాట బరిలోకి దిగిన సదర్లాండ్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు సదర్లాండ్‌ను దక్కించుకుంది.

దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ షబ్నిమ్ కూడా భారీ ధరను పలికింది. ఆమెను ముంబై ఇండియన్స్ రూజ1.2 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా బ్యాటర్ లిచ్‌ఫీల్డ్ కూడా రూ. కోటి ధరను పలికింది. ఆమెను గుజరాత్ టీమ్ దక్కించుకుంది. ఇక భారత్‌కు చెందిన యువ క్రికెటర్ వింద్రా దినేశ్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయింది. రూ.10 లక్షల బేసిక్ ధరతో బరిలోకి దిగిన కర్ణాటక హార్డ్ హిట్టర్ వింద్రా దినేశ్‌ను యూపి వారియర్స్ రూ.1.3 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. కాగా శనివారం జరిగిన మినీ వేలం పాటలో 165 మంది క్రికెటర్లు బరిలోకి దిగారు. వీరిలో 104 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. మరో 61 మంది విదేశీ క్రికెటర్లు బరిలోకి దిగారు. కాగా, భారత స్టార్ ఆల్‌రౌండర్ దేవిక వైద్యను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అంతేగాక భారత క్రికెటర్లు పూనమ్ రౌత్, మోనా మెష్రామ్, సుష్మ వర్మ, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డాటిన్, ఆస్ట్రేలియా స్టార్ కిమ్ గార్డ్, శ్రీలంక ఆల్‌రౌండర్ చమరి ఆటపట్టులకు వేలం పాటలో నిరాశే ఎదురైంది. వీరిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచూజీ ఆసక్తి చూపలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News