- Advertisement -
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కశ్యప్ పటేల్ కు ట్రంప్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్(ఎఫ్ బిఐ) డైరెక్టర్ గా ఆయన్ని నియమించినల్లు ప్రకటించారు. ‘‘ఆయన న్యాయవాది, పరిశోధకుడు. అమెరికాలో అవినీతి నిర్మూలనకు, న్యాయం కోసం అహర్నిశలు పోరాడుతున్నారు. ఆయన నియామకంతో ఎఫ్ బిఐకి గత వైభవాన్ని తీసుకొస్తాం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కశ్యప్ గుజరాతీ మూలాలున్న వ్యక్తి. ఆయన తండ్రి ఈదీ అమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో 1980లో కశ్యప్ జన్మించాడు.
- Advertisement -