Monday, December 23, 2024

కస్తూర్బా టీచర్లను విధుల్లోకి తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

Kasturba teachers should be hired

మనతెలంగాణ/ హైదరాబాద్ : విధుల నుంచి నుంచి తొలగించిన 937 మంది కస్తూర్భా పాఠశాల టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని నిరుద్యోగ జెఎసి చైర్మన్ నీల వెంకటేష్ కోరారు. గురువారం నగరంలోని వందలాది మంది టీచర్లు పాఠశాల డైరెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా మౌఖిక ఆదేశాలతో కెజిబివి టీచర్లను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కాంట్రాక్టు పద్ధతిన ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నియమించుకున్న టీచర్లను విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. తొలగించిన టీచర్లను తిరిగి తీసుకోవాలని, వారి పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో కెజిబివి సిబ్బంది, ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, విద్యార్థి సంఘాల నేతలు వేముల రామకృష్ణ, మల్లేష్‌యాదవ్, దీపిక, లత ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News