Sunday, September 8, 2024

గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’

- Advertisement -
- Advertisement -

ఈదులు, తాళ్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల కోసం ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అబ్దుల్లాపూర్‌ మెట్ మండలం, లష్కర్‌గూడ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు జరగనుంది. గౌడన్నలతో సమావేశం అనంతరం అక్కడే వారితో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో చాలాసార్లు ప్రమాదాల బారిన పడి గీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ ప్రమాదాలను నివారించేందుకు ఆధునికతను జోడించి సేఫ్టీ కిట్లను హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసింది. గీత కార్మికులు సులువుగా తాళ్లు ఎక్కేలా ఈ కిట్లను రూపొందించారు. ప్రమాదవశాత్తు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా ఈ పరికరాల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ఒక్కో కిట్‌లో మొత్తం 6 పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలోనే, యూజర్ ఫ్రెండ్లీగా ఈ పరికరాలు ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News