Monday, December 23, 2024

భర్తతో కలసి కేట్ షాపింగ్

- Advertisement -
- Advertisement -

లండన్: బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్‌టన్ ఆరోగ్యంపై ఏర్పడిన వివాదాలకు చెక్ పెడుతూ తన భర్త ప్రిన్స్ విలియమ్‌తో కలసి తన నివాసం సమీపంలో షాపింగ్‌కు వెళుతున్న ఆమె ఫోటో తాజాగా వెలుగు చూసింది. ఉదర సంబంధ వ్యాధికి శస్త్ర చికిత్స చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారి కేట్ తన పిల్లలతో కలసి తీసుకున్న ఫోటో ఎడిటింగ్ జరిగినట్లు వార్తలు రావడంతో అది పెను వివాదానికి దారితీసింది.

షాపింగ్ బ్యాగు ధరించి 42 ఏళ్ల యువరాణి కేట్ తన భర్తతో కలసి షాపింగ్‌కు వెళుతున్న వీడియో ఒకటి సోమవారం రాత్రి దర్శనమిచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య కథనాలను కట్టడి చేసేందుకే ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు ది సన్ వార్తాపత్రిక తెలిపింది. కేట్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలు ఈ వీడియోతోనైనా అంతం అవుతాయన్న ఆశాభావాన్ని కెన్సింగ్‌టన్ ప్యాలెస్ కార్యాలయం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News