Monday, December 23, 2024

క్లీన్ ఫ్యామిలీ హారర్ కామెడీ మూవీ

- Advertisement -
- Advertisement -

త్రిగున్, పూజిత పొన్నాడ హీరోహీరోయిన్లుగా యమ్.పి. ఆర్ట్ పతాకంపై చాణిక్య చిన్న దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి నిర్మించిన సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. శుక్రవారం థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా త్రిగున్ పాత్రికేయులతో మాట్లాడుతూ “ఒక మంచి క్లీన్ ఫ్యామిలీ హారర్ కామెడీ సినిమా చేయాలన్న ప్రయత్నమే “కథ కంచికి మనం ఇంటికి’. ఇందులో ఫ్యామిలీస్ ఆకట్టుకునేలా అన్ని అంశాలు ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ కోసం భారీగా ఖర్చు చేయడం జరిగింది. ప్రేక్షకుడు థియేటర్‌లో కూర్చొని నవ్వుతూ ఎంజాయ్ చేసే సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. ఇక ప్రస్తుతం నేను చేసిన ‘కొండా’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ‘ప్రేమదేశం’ పేరుతో మరో సినిమా చేయబోతున్నా ”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News