Monday, December 23, 2024

‘కథా కేళి’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కథా కేళి’. హైదరాబాద్‌లో జరిగిన ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ‘కథా కేళి’ మూవీ లోగోను అగ్ర నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. టీజర్‌ను స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ “శతమానం భవతి సినిమా మా బ్యానర్‌లో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడదే పేరుతో దర్శకుడు సతీష్ బ్యానర్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ‘కథా కేళి’ టీజర్ చూస్తుంటే సతీష్ కొత్త ప్రయత్నం చేసినట్లు అనిపించింది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను”అని అన్నారు.

చిత్ర దర్శకుడు సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ “ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని చేసిన సినిమానే ఈ ‘కథా కేళి’. దెయ్యానికి కథ చెప్పాల్సి వస్తే… అనేదే మా సినిమా. నా స్టైల్లో ఫ్యామిలీస్ అందరూ చూసి వారి పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే కథ ఇది. ఇప్పటి యూత్‌కు కూడా నచ్చుతుంది. అందరినీ నవ్వించే హారర్ కామెడీ ఉంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, చిత్ర సమర్పకుడు చింతా గోపాల కృష్ణా రెడ్డి, ఎస్.కె.బాలచంద్రన్, దాము నర్రావుల, పూజితా పొన్నాడ, అజయ్, నందిని, యశ్విన్, దినేశ్ తేజ్, బాలాదిత్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News