Monday, December 23, 2024

కథక్ కళాకారుడు పద్మవిభూషణ్ బిర్జూ మహరాజ్ కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కథక్ కళాకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జూ మహరాజ్(83) కన్నుమూశారు. ఢిల్లీలోని  నివాసంలో గుండె పోటుతో ఆయన మరణించారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో తన మనువళ్లతో కలిసి ఆడుతున్న సమయంలో ఆయన సడెన్ గా కిందపడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పండిట్ బిర్జూ మహరాజ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. బిర్జూ మహరాజ్ మృతితో కళా ప్రపంచం ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయిందని ప్రధాని మోడీ అన్నారు.

Kathak dancer Birju Maharaj dies at 83

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News