Wednesday, January 22, 2025

ఇద్దరు పిల్లలు, తల్లి గొంతు కోసి హత్య….

- Advertisement -
- Advertisement -

పాట్నా: గుర్తు తెలియని దుండగులు ఇద్దరు పిల్లలు, తల్లిని గొంతుకోసి హత్య చేసిన సంఘటన బిహార్ రాష్ట్రం కథిహర్ జిల్లాలోని బాలియా బాలన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సింఘ్‌పూర్ గ్రామంలో సఫద్ జరీన్, మహ్మాద్ ఫీరోజ్ అనే దంపతులు నివసిస్తన్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. మొహర్రం వేడుకలను వీక్షించడానికి ఫీరోజ్ బయటకు వెళ్లాడు. ఇంట్లో భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఫీరోజ్ ఇంటికి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో కనిపించడంతో పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. దుండగులు గొంతు కోసం హత్య చేసినట్టుగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో పదునైన ఆయుధం, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మృతదేహాలను కాల్చడానికి ప్రయత్నించినట్టు సమాచారం.

Also Read: తోడేళ్లదే రాజ్యం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News