Sunday, November 24, 2024

నటి కత్రినా కైఫ్ పెళ్లి???

- Advertisement -
- Advertisement -

katrina kaif

ముంబయి: బాలీవుడ్ నటి కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ పెళ్లి చేసుకోనున్నారని చాలా రోజులుగా గుసగుసలయితే వినిపించాయి. కానీ నిజమెంతో అబద్ధమెంతోగానీ ఆ మాట కాస్త ఆచరణ రూపం దాల్చేలాగానే ఉంది. ఓ ఆంగ్ల పత్రిక వారి పెళ్లి గురించి రాసింది. వారి వివాహం రాజస్థాన్‌లో జరుగనుందని చెప్పుకుంటున్నారు. ఎంత గోప్యంగా ఉంచినా విషయం బయటికి తెలిసిపోయినందుకు కత్రినా కైఫ్ అసంతృప్తితో ఉందట. ఆ వేదికను మార్చుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే విక్కీతో డేటింగ్, పెళ్లి విషయాన్ని మాత్రం కత్రినా ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ కాబోయే భార్య కత్రినా కోసం విక్కీ ముంబయి జుహులోని రాజ్‌మహల్‌లో ఓ విశాలవంతమైన ఇల్లును అద్దెకు తీసుకున్నాడని, ఐదు సంవత్సరాల లీజు కుదుర్చుకున్నాడని, అడ్వాన్సుగా రూ. 1.78 కోట్లన ఉ చెల్లించాడని సమాచారం. కాగా ఇదే అపార్ట్‌మెంట్‌లో క్రికెటర్ కోహ్లి, నటి అనుష్క శర్మ దంపతులు కూడా ఉంటున్నారట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News