Thursday, January 23, 2025

కౌలాస్ కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం

- Advertisement -
- Advertisement -

కౌలాస్ కోటను సందర్శించిన మంత్రి జూపల్లి

మన తెలంగాణ / హైదరాబాద్ / జుక్కల్ : రానున్న రోజుల్లో చారిత్రాత్మక కౌలాస్ కోటను పర్యాటకంగా అభివృద్ది చేస్తానని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ ఖిల్లా (కోట)ను ఎంఎల్‌ఏ తోట లక్ష్మీకాంతరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్‌పి సింధు శర్మ తదితరులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు.

కౌలాస్ కోట చరిత్రను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాజవంశీకులైన అనూప్‌సింగ్, అనితా సింగ్ మంత్రికి వివరించారు. కోటలోని ప్రాముఖ్యత కలిగిన ఆనవాళ్లపై మంత్రి ఆరా తీశారు. మూడు రాష్ట్రాల ( కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ) సరిహద్దులో ఉందని , పర్యాటకంగా అభివృద్ది చేస్తే బాగుంటుందని స్థానికులు మంత్రిని కోరారు. నిజాం రాజులు, కాకతీయులు పాలించిన కోటగా చరిత్ర చెబుతోందని వివరించారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ సైతం ఇక్కడే నివసించినట్లు పేర్కొంటున్నారన్నారు. ఇదే కోటను పోలిన మహారాష్ట్రలోని ఖందర్ ఖిల్లా ఉందన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన కౌలాస్ కోటను అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించి, నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. కౌలాస్ కోట అభివృద్ధిపై త్వరలోనే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అమృత్ వార్ వినోద్, దడిగి విట్టల్ రెడ్డి, పుల్కల్ వెంకట్ రామిరెడ్డి, మద్నూర్ సంగమేశ్వర్, అనిత సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News