Monday, July 1, 2024

ఆ అధికారులకు తప్పవు ‘బ్లాక్ డేస్’: కౌశిక్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికారులు ఎవరైతే ప్రభుత్వ నియమాలు పాటించకుండా అవకతవకలకు పాల్పడతారో వారికి ‘బ్లాక్ డేస్’ తప్పవని హుజురాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.

ఆయన ఆదివారం ఇక్కడ ప్రెస్ మీట్ లో ‘బ్లాక్ బుక్’ను చేతబూని అవినీతి అధికారుల చిట్టాను అందులోకి ఎక్కిస్తున్నట్లు తెలిపారు. ‘‘ ప్రతి రోజూ ప్రతి ఒక్కరూ నియమానుసారమే నడుచుకోవాలి. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా నియమాలు ఎందుకు పాటించడం లేదు? నేను ‘బ్లాక్ బుక్ ’ సిద్ధం చేశాను. ఎవరైతే ప్రభుత్వ నియమాలు పాటించరో వారి పేర్లను ఈ బ్లాక్ బుక్ లో రాస్తాను. ఎపుపడైతే బిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందో అప్పుడు ఈ నల్ల పుస్తకంలో ఉన్న వారికి చెడు దినాలు తప్పవు’’ అని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.

దీనికి ముందు మంత్రి పొన్నం ప్రభాకర్, కౌశిక్ రెడ్డికి పరువు నష్టం దావా నోటీసలు పంపారు. కాగా కౌశిక్ రెడ్డి తాను ఫ్లయ్ యాష్ తీసుకెళుతున్న 13 లారీలను పట్టుకుంటే రవాణా శాఖ రెండు లారీలనే సీజ్ చేసి మిగతా వాటిని వొదిలేసిందన్నారు. మంత్రి ఫోన్ కాల్స్ చేశాక అలా జరిగిందన్నారు. ఫ్లయ్ యాష్ అనేది పవర్ స్టేషన్ లో బొగ్గును కాల్చిన తర్వాత వచ్చే బై ప్రొడక్ట్. ఆ బూడిద వల్ల అనేక ఇతర ఉపయోగాలున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News