Thursday, January 9, 2025

కౌశిక్‌రెడ్డికి తప్పిన పెను ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి హుజురాబాద్ వెళ్తుండగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద కౌశిక్ రెడ్డి కాన్వాయ్‌కు ఓ బైకు అడ్డు రావడంతో చెట్టును ఢీకొట్టింది. అనంతరం పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ఎయిర్‌బెల్లూన్లు ఓపెన్ కావడంతో చిన్నపాటి గాయాలతో ఎంఎల్‌సి బయపడ్డారు. బైక్‌పై ఉన్న వ్యక్తి గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడు కూడా స్వల్పంగా గాయపడ్డారని తెలిపారు. కౌశిక్ రెడ్డికి పెను ప్రమాదం తప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హుజురాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదానికి సమీపంలో పెద్ద వృక్షం ఉందని, దాన్ని ఢీకొట్టి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదన్నారు.

Also Read: రోహిత్‌శర్మపై ఆగ్రహజ్వాలలు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News