Monday, December 23, 2024

కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

- Advertisement -
- Advertisement -

కొమురవెల్లి : హుజురాబాద్‌లో జీఎస్‌ఆర్‌టివి జర్నలిస్టు అజయ్ ముదిరాజ్‌ను అసభ్య పదజాలంతో తిడుతూ ముదిరాజు జాతిని అవమాన పరుస్తూ ముదిరాజ్ జాతిని అవహేళన చేసి ,దాడి చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొమురవెల్లి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి కిష్టయ్య డిమాండ్ చేశారు.

అనంతరం పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముదిరాజ్ జర్నలిస్టును కిడ్నాప్ చేసి దాడి చేసి ఆపైన ముదిరాజ్ జాతిని కించపరుస్తూ అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలన్నారు. అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కౌశిక్ రెడ్డి రోడ్లపైన తిగరకుండా అడ్డుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఆంజనేయులు, చిక్కుడు కనకయ్య, మేడికుంట శ్రీనివాస్, గొల్లపల్లి నాగరాజు, సార్ల కనకయ్య, చిక్కుడు అంజయ్య , ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News