Wednesday, January 22, 2025

కౌశిక్ రెడ్డి వర్సెస్ అరెకపూడి గాంధీ పొలిటికల్ వార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీ, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ముందుస్తు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎవరు దమ్ము ఎంటో తేల్చుకుందామని డైలాగ్ వార్ నడుస్తోంది. అరెకపూడి గాంధీ ఇంటికి వచ్చి బిఆర్‌ఎస్ కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా కౌశిక్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో కొండాపూర్‌లోని ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డిని పోలీసుల గృహనిర్బంధం చేశారు. పార్టీ పిరాయించిన పది మంది ఎంఎల్‌ఎలపై వేటు వేయాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి సవాల్‌ను ఎంఎల్‌ఎ అరెకపూడి గాంధీ స్వీకరించారు. ‘నువ్వు మా ఇంటికి రాకపోతే.. నేను మీ ఇంటికి వస్తా’ అని అరెకపూడి ప్రతిసవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News