తెలుగు రాష్ట్రాల నుండి మరిన్ని వందేభారత్ రైళ్లు
1026 కి. మీ కవచ్ టెక్నాలజీ ఏర్పాటు
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉన్నందున ఆలస్యం అవుతోందని ఆయనన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలోని రైల్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాజీపేటలో రైల్వేప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రికార్డు స్థాఁఙళక్ష రూ. 5,337 కోట్ల కేటాయించినట్లు తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 నుండి 2014 వరకు కేవలం రూ. 886 కోట్లు మాత్రమే కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణలో రేల్వే ప్రాజెక్టుల కోసం రూ.41,677 కోట్లు మంజూరు అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుండి ఐదు వందేభారత్ రైళ్లు రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తూ నడుస్తున్నాయన్నారు. త్వరలో తెలంగాణకు నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు రాబోతున్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడుపుతామని ఆయన తెలిపారు. యూపిఎ హయాంలో అత్యధికంగా రూ. 886 కోట్ల కేటాయింపులు మాత్రమే జరిగాయని కేంద్ర మంత్రి తెలిపారు.
సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్
రైల్వే ట్రాక్‌ల నిర్వహణలో స్విట్జర్లాండ్ వ్యవస్థను పాటిస్తున్నట్లు కేంద్ర మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని వివిధ సెక్షన్‌ల పరిధిలో 1,465 కిలోమీటర్ల మేర ప్రస్తుతం కవచ్ టెక్నాలజీ ఉందన్నారు. మరో 1,026 కిలోమీటర్ల మేర ఈ టెక్నాలజీ విస్తరింప చేస్తారని చెప్పారు. 2026 లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
ధనిక దేశాలైన ఫ్రాన్స్, జర్మనీలో కూడా కవచ్ ఏర్పాటుకు 21 ఏళ్లు పట్టిందన్నారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. 2056 లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తైనట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్స్ పథకం కింద తెలంగాణలో 40 స్టేషన్‌ల ఆధునీకరణ జరుగుతోందన్నారు.
ఎపికి రూ.9,417 కోట్లు
దేశంలో పేద వర్గాల కోసం నమో భారత్ రైళ్లను నడుపుతున్నామని కేంద్ర మంత్రి వైష్ణవ్ చెప్పారు. త్వరలో దేశమంతా దాదాపు 100 నమో భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇక ఈ బడ్జెట్‌లో ఎపికి రూ. 9,417 కోట్ల విలువైన ప్రాజెక్టుల కేటాయింపులు జరిగాయని తెలిపారు. యూపిఎ హయాంలో కంటే ఎపికి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయుంపులు జరిగాయని చెప్పారు.
ఏపీలోని మొత్తం అములవుతున్న రైల్వే ప్రాజెక్టులు రూ. 84,559 కోట్లు అని తెలిపారు. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. కొత్త ప్రాజెక్టులను బడ్జెట్లో ప్రకటించడం లేదని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 1560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ వేసినట్లు వెల్లడించారు. రైల్వే పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఎపిలోని 16 జిల్లాల మీదుగా 8 ందే భారత్ రైళ్లు తిరుగుతున్నాయని, రాష్ట్రానికి మరిన్ని వందే భారత్ రైళ్లు కేటాయిస్తామన్నారు. అన్ని రైళ్లు 110 కి.మీ. వేగంతో వెళ్లేలా ట్రాక్‌లు సిద్దం చేస్తున్నామన్నారు. కొన్ని రూట్లలో 130 నుండి 160 కి. మీ వేగంతో వెళ్లేలా ట్రాక్‌లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.