Thursday, January 23, 2025

తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ప్రతి ఫలించిన కవి సమ్మేళనం

- Advertisement -
- Advertisement -

సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలలో భాగంగా ఆదివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కవి సమ్మేళనం జరిగింది. సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కవి సమ్మేళనంలో సత్తుపల్లి ప్రాంత కవులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు జరిగిన ఉద్యమాన్ని ఆతరువాత తెలంగాణ అభివృద్ధి కోసం జరిగిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం,వివిధ అభివృద్ధి పధకాలను గురించి కవులు తమ కవితలలో చదివి వినిపించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టవలసిన కార్యక్రమాలను తమ కవితలలో చదివి వినిపించారు.

కవి సమ్మేళనం అనంతరం సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య కవులను శాలువా, జ్ఞాపిక, పూల మాలలతో సత్కరించారు. సత్తుపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, కమీషనర్ సుజాత, కవులు మధుసూదన రాజు, రామకృష్ణ, మల్లికార్జునరావు, రమణమూర్తి, అయ్యదేవర శేషగిరిరావు, మాదిరాజు మాలతి, చిమ్మపూడి కళ్యాణ శర్మ, పల్లం పిచ్చయ్య,గట్టే వాసు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News