Monday, February 24, 2025

పదమూడేళ్ల కవి సంగమం ఏం చేసింది?

- Advertisement -
- Advertisement -

కలవడమే, కలపడమే కవిత్వం! మనిషి జీవించడానికి కావాల్సిన భరోసాను ఇవ్వడమే కవిత్వం. మనిషి పక్కన మనిషిని నిలబెట్టే ఒకానొక అనుబంధం కవి సంగమం. ఎందరో కవులు రాస్తున్న దీర్ఘకావ్యం కవి సంగమం. కొన్నివేల మంది సృజనకారుల జైత్రయాత్ర కవి సంగమం. ఎన్నో అడుగుల ఎన్నో నడకల గెలుపు వేదిక కవి సంగమం.

మీరెందుకు కవి సంగమం పెట్టాలనుకున్నారు? లక్ష్యాలేమిటి?

నిజం చెప్పాలంటే 1990వ దశకంలో తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వం చాలా గొప్ప దశలో ఉండేది. కవిమిత్రులు తరచు కలిసే కవిత్వ వాతావరణం ఎటు చూసినా కనిపించేది. కాని ఆ తర్వాత తెలుగు కవిత్వం పట్ల యువతలో క్రమే ణా ఆసక్తి తగ్గుముఖం పట్టింది. 2010 నాటికి తెలుగు కవిత్వం ఎక్కడ అని వెదుక్కునే పరిస్థితి వచ్చింది. కవిత్వాన్ని అచ్చేసే పత్రికలు కరువైన స్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ మాధ్య మం ద్వారా కవిత్వం కోసం, కవిత్వవాతావరణం నిర్మించడం కోసం కవిసంగమం ఏర్పాటయ్యింది. ఫేస్‌బుక్ ఆరంభమైన తొలి రోజుల్లోనే భారతీయ భాషలలో కవిత్వానికి వేదికగా చేసుకు న్న అతికొద్ది వాటిల్లో కవిసంగమం ఒకటి. వేలాదిమంది కవిత్వాభిమానులతో కవిసంగమం ఎదుగుదల కవిత్వం పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు చిహ్నం. గతంలో పత్రికలపై ఆధారపడి సాహిత్యం నడుస్తుండేది. పత్రికలు ఎవరికి ప్రాధాన్యత ఇస్తా యో వారే సాహిత్యకారులుగా, కవులుగా గుర్తింపు పొందేవారు. తర్వాత సోషల్ మీడియా గొప్ప అవకాశంగా ముందుకు వచ్చింది. ముఖ్యంగా యువ త సోషల్ మీడియాలోకి వెళ్లారు. వారిని వెదుక్కుం టూ అక్కడికే ఒక వేదికగా కవిసంగమం వెళ్ళింది. 2012లో మొదలైన కవిసంగమంలో రాసేవారు, చదివేవారు పదిహేడు వేలమందికి పైగా ఉన్నారు. తెలుగునేలపై కవిత్వాన్ని అందరికీ చేరువచెయ్య డం, ముఖ్యంగా యువతలో కవిత్వాభినివేశం పెం చడానికి ప్రారంభించిన కవిసంగమం తన లక్ష్యా న్ని చాలామటుకు సాధించిందనే అనుకుంటున్నా ను. ఇంకో విషయం కవిసంగమం నిలబడటానికి కారణం- నిరంతరంగా కార్యక్రమాలు రూపొందిస్తూ చలనశీలంగా ఉండటం. కవిసంగమం ఎం దరినో ఒకచోటికి చేర్చినమాట నిజం. అప్పటివర కూ కవిత్వంలో లేని పేర్లెన్నో ఇవాళ కవిత్వ రంగంలో వినబడుతున్నాయి. 2012 నుంచి నేటికీ తెలుగు సాహిత్యానికి ఎందరో నూతన కవుల్ని పరిచయం చేసింది. కవి సంగమం తెలుగు కవిత్వంలో కొత్త, పాత తరానికి మధ్య వారధిగా మారింది. కవిత్వంలో కవిసంగమం రినైసెన్స్ సృష్టించిందని 13 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చెప్పదలిచాను.

కవిసంగమం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది?

ఫేస్‌బుక్‌లో వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యం గా కవిత్వసృజన, సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఏర్పడిన సమూహం. కవిత్వసృజన, కవిత్వపఠనం, కవిత్వ సంబంధిత అంశాలు ఇవన్నీ అవగాహన చేసుకుం టూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా కవిసంగమం సీరీస్ సభలు పోయెట్రీ వర్క్‌షాపుల్లా జరిగేట్లు రూపొందించాం. సీనియర్ కవుల అనుభవాలు వారికి అందేట్లు చూసాం. కలిపే వారధిగా నిర్మించాం. వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను కవిసంగమం గ్రూప్‌లో పోస్టు చేయడం, నెలనెలా కార్యక్రమాల్లో ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ “లెర్నింగ్ ఇన్ ప్రా సెస్‌” మార్గంలో పయనించాం. హైదరాబాద్‌లోని లామకాన్‌లో జరిగిన మూడుతరాల కవిసంగమం మొదటి కార్యక్రమంలో నగ్నముని గారు ‘ఒక తరానికి మరోతరానికి వారధి’ని నిర్మిస్తోంది కవిసంగ మం అన్నారు. వసీరా – లోహనది, మరోదశ తర్వా త తనలో ఏదో తెలియని నిశ్శబ్ధం ఆవరించిందని, కవిసంగమం తనలో కవిని మళ్ళీ తట్టిలేపిందనీ అన్నారు. వీరిద్దరి అభిప్రాయాలు కవిసంగమం ఏం చేసి చూపిందో చెప్పకనే చె బుతాయి. పరభాషా కవులను యువకవులకు పరిచయం చేసి వారి నుంచి నేర్చుకునే అవకాశం క ల్పించడం కవిసంగమం చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యమైనది. కవిత్వం ఎలా రాయాలన్నది పాఠాలుగా కాక, కవిత్వ నిర్మాణం ఇత్యాది అంశాలను పరిచయం చేయడం గాసాగాం. నేర్చుకుంటూ, అవగాహన పెంపొందిస్తూ కవిత్వసృజన చేయాలనేదే తలంపు.

కవి సంగమాన్ని ఎలా విస్తరింపజేశారు?

ఒక్కో దశలో ఒక్కో అంశా న్ని తీసుకుని ముందుకు సాగాం. కవిత్వ నిత్యచైతన్య మార్గంలో నడిచాం. -మూడుతరాల కవిసంగమం, బ్లాగ్, యూట్యూబ్, చిత్కళ- ప్రసిద్ధకవుల కవితల పంక్తుల పోస్టర్స్, పోస్ట ర్ పోయెట్రీ, ఊరూరా కవిసంగమం, పోయెట్రీ ఫెస్టివల్స్, ఎంపిక చేసిన వ్యాసాలు పోస్టింగ్స్, పుస్త క ప్రచురణలు ఇలాంటివెన్నో. ప్రత్యేకంగా ప్రతిరోజూ రాసే కాలమ్స్ గురించి ప్రస్తావించాలి. కవి త్వం ప్రక్రియ గురించి ప్రతిరోజూ ఒకరిచేత కాల మ్ రాయించడం అనేది పదేళ్లుగా కొనసాగిస్తున్నాం. వీటిలో కవిత్వసంబంధమైన అంశాలు ప్రధానంగా చర్చలోకి వస్తాయి. ఈ క్రమంలో యువ కవిత్వ విశ్లేషకులు ఎందరో వెలికివచ్చారు. ఇది సామాన్య విషయం కాదు. సాధారణ పాఠకులు కాక కవిత్వం అంటే ఇష్టంఉన్న ప్రత్యేకమైన పాఠకులు కవితను చదవడం మామూలు విషయం కాదు. మునుపెన్నడూ లేని వేగంతో కవిత్వవ్యాప్తి జరిగింది. కవి సంగమం నేర్చుకోవడానికి శాస్త్రీయ పద్ధతుల్ని అనుకరించింది. ప్రాసెస్ లెర్నింగ్‌లో నేర్పేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు ఇద్దరు ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. ఇది భాగస్వామ్య పధ్ధతి. కవి సంగమంలోని ప్రాసెస్‌లో వివిధ తరాలకు, పలు శైలి, ప్రత్యేకతలు ఉన్న కవులు కనపడతారు. అందుకే ఒక పర్టిక్యులర్ సిద్ధాంతానికి, తరానికి లేక కోవకో చెందినది కాదు. పలు రకాల పక్షులకు ఒక చెట్టుగూడులా కవిసంగమం ఉంది.

కవిసంగమంలో కొత్తగా రాస్తున్న వారి కవిత్వం ఎలా ఉంది?

ఇప్పుడు ఈ కవులు కేవలం అంతర్జాల మాధ్యమానికే పరిమితమై లేరు. పత్రికల సాహిత్యపేజీలలో నూ కనిపిస్తున్నారు. చేరాతలు పుస్తకానికి నండూరి రామ్మోహనరావు గారు రాసిన ఒక మా టను గుర్తుచేసుకోవాలి. “ప్రతి కొత్త కవిత్వం ఒక దారిన పడిపోతున్న సమకాలిక కవిత్వాన్ని మలు పు తిప్పడానికి యత్నిస్తుంది. ‘ఆ మలుపు తిరిగే కాలంలో తెలుగు కవిత్వం ఉంది. అనేక సామాజిక, జాతీయ అంతర్జాతీయ అంశాలను, మానసిక అంతర్లోకాలను, సమకాలీనమైన అన్ని అంశాలను కవిత్వం చేస్తున్నారు. ఆధిపత్యాలను, వివక్షతలను ప్రశ్నిస్తున్నారు. ఈ పదేళ్ల కాలంలో వచ్చిన కవితా సంపుటాలు తిరగేస్తే ఈ విషయం రూఢి అవుతుంది. ఏదో రాస్తున్నారులే అనే అపోహ కూడా ఉంది. తేలిగ్గా తీసిపడేసే పరిస్థితులూ ఉన్నాయి. కానీ పేర్ల రాము అనే యువకవి కవితలో చెప్పినట్టు ‘రెక్కలొచ్చిన సీతాకోకచిలుకలా ఎగిరే వాక్యం, తినడానికి బుజబుజ పండిన సీతఫలం లాంటి వాక్యం, రంగుల్ని గీయగలిగిన వాక్యం, కలల్ని మోయగల వాక్యం, కన్నీటిధారలను ముడేయగల వాక్యమొకటి కావాలి. ‘కవిత్వం అంటే ఏమిటో, విశిష్టత ఏమిటో, ఎందుకు అవసరమో కూడా ఎరుక ఉన్న ఈ తరం కవుల్లో ఉందనేది స్పష్టం. సోషల్ మీడియా కవిత్వం అని కొట్టిపడేసేందుకు లేదనే విషయం చెప్పదలుచుకున్నాను. మరోవైపు తక్షణ స్పందనలు, తక్షణ గుర్తింపులు కోరుకుంటున్న వాతావరణం ఉంది. విమర్శను తట్టుకోలేని ఒక స్థితి కూడా ఉంది. సలహాలను, అభిప్రాయాలను స్వీకరించే మానసికత తక్కువగా ఉంది. తాము ఏం రాసినా అది కవిత్వమే అనే మొండితనం ఉంది. వీటన్నిటిని దాటి ఒక విషయం -వాళ్ళు రాయడం వైపునకు, చదవడం వైపునకు వచ్చారనే ఒక పాజిటివ్ అంశాన్నిగుర్తించాలి. సోషల్ మీడియాలో వచ్చే తక్షణ స్పందనలలో వివరంగా ఆ కవితను గురించి చెప్పగలిగిన స్థితి తొలిరోజుల్లో ఉండేది. ఎడిటింగ్ విషయం, కవితలోని లోపాలు వంటి అంశాలను దృష్టికి తెచ్చే సమయం ఉండేది. అక్కడే చెప్పడం బాగుండదేమో అనిపించి మెసేజుల్లో చెప్పే పద్ధతి ఉండేది. క్రమేణా అది తగ్గింది. వివరంగా చెప్పే సావకాశం చిక్కడం లేదు. కవిత బాగోలేదు అని చెప్పే స్వేచ్ఛ లోపించిన మాట వాస్తవం. కేవలం బాగుంది అని చెప్పడం వరకే పరిమితం అవడం ఉంది. ఇది కవిత్వానికి నష్టం కలిగించే అంశమే. ఈ పరిస్థితిని అధిగమించే ఒక టర్న్ తప్పక వస్తుందని వేచిచూడాల్సిందే. వీటన్నింటినీ దాటి మంచి కవితను ఇప్పటికీ పాఠకులు గుర్తిస్తున్నారనేది వాస్తవం. తాలూ తప్పను నిరాకరిస్తురనేది కూడా అంతే వాస్తవం.

కవి సంగమం వల్ల వస్తువు, నిర్మాణం వంటి అంశాల్లో కొత్తదనమేదైనా వచ్చిందా? కవిత్వ ప్రయోగాలు ఏవైనా గమనించారా?

కొత్తదనమైతే ఉంది. కొందరు ప్రయత్నం చేశారు. కొత్త పరిభాష వచ్చింది. పేరాగ్రాఫిక్స్, చైతన్య
స్రవంతి, విభిన్న ఉద్వేగాలను ఒకే కవితలో పొదగడం, కథనాత్మకంగా చెప్పడం, సంభాషణలశైలిలో కవిత్వంచేయడం, లిరికల్ పోయెట్రీ వంటి ప్రయోగాలు కన్పిస్తాయి. కాలంతో పాటు వస్తు నిర్మాణ వైవిధ్యం కూడా పెరుగుతుంది. కవిసంగమంలో రాస్తున్న కవుల నేపథ్యాలు వారి కవిత్వం లో కనిపిస్తాయి. వస్తువు అనేది ఈ నేపథ్యాల
నుంచి లభిస్తుంది. కవిసంగ మం కవులను ప్రత్యేక కవిత్వ మే రాయాలని నిర్బంధించదు. ఆధునిక జీవితానికి సంబంధించి కొత్త కోణాలు కవిత్వం లో ప్రతిబింబించాయి. ఏదైనా వస్తువు కావచ్చు. కాని సామాజికాంశాల్లో కూడా వస్తు నిర్మాణ వైవిధ్యం విస్తుపోయేలా చేసిందని, ఉందని గుర్తించాలి.

ఇంత విస్తృతంగా కవిత్వం రాయడం ఒకవైపు, ఇంతమంది కొత్త కవులు ఒకవైపు ఒప్పుకో వాల్సిందే కానీ, ఆత్మాశ్రయత పెరిగిందా? సామాజిక కోణం తగ్గిందా?

సాధారణంగా కవిత్వ ప్రయాణం ఆత్మాశ్రయ, అ నుభూతి కవిత్వాలతోనే ప్రారంభం అవుతుందని అనుకుంటాను. ఏదోఒక అనుభవంతో ఉద్వేగంతో కవిత్వం రాయడం ప్రారంభిస్తారు. నిజానికి ఇ లాంటి వారికి దశ, దిశ చూపించే వేదికయ్యింది. క్రమేణా సామాజికస్పృహతో కూడిన కవిత్వం, సామాజిక చైతన్యానికి కారణమయ్యే కవిత్వం రాయడం ప్రారంభమవుతుంది. ఆత్మాశ్రయత అనేది కవిత్వంలో ఎప్పుడు ఉండేదే. ఆత్మాశ్రయ కవిత్వానికి దానిదైన ప్రాధాన్యత ఉంది. సామాజిక దృక్పథంతో వచ్చే కవిత్వమే నిజానికి ఇప్పుడు ఎక్కువగా ఉంది. సామాజిక కోణం తగ్గిందనే వాదననను ఒప్పుకోలేను. మనిషిని మనిషిలోకి తిరిగి రప్పించే దిశగా కవిత్వం, మనిషి పక్కన మనిషి నిలబడే స్వేచ్ఛదిశగా కవిత్వం- వస్తోందని నమ్ముతున్నా. నా సమాధానానికి ఊతంగా నిలబడతా యి. ఈ రెండు కవితల పంక్తులు చదవండి. పరిశీలించండి. “కవితంటే ఒక మానసిక సంఘర్షణ. ఒక భావ విస్ఫోటనం.. ఒక నిరసన.. ఒక ఊగిసలాట.. ఓదార్పు.. అన్యాయాన్ని ప్రశ్నించడం”
(విలాసాగరం రవీందర్). ‘పద్యంలో మళ్ళీ బతకా లి. మొదటి వాక్యాన్ని రాశాక మరణించు. రెండో వాక్యంలో జీవిస్తావు. రాని పదాలను మచ్చిక చేసుకోకు. నీవే పదాల్లోకి పరకాయం చేయి. వాన చిగురులో పచ్చదనమై దాగినట్టు కవిత్వంలో ఆత్మే ఉండాలి. దేహం కాదు. కొన్ని పదాలపై మోహాన్ని పెంచుకోకు. ఉత్తుత్తినే మాటలను కోటలుగా పేర్చ కు. రాసిన పద్యానికి శస్త్రచికిత్స అవసరమేర్పడుతుంది ఒక్కోసారి సంతకంపై ఇష్టాన్ని అట్టే పెంచుకోకు. దస్తూరి కవిత్వాన్ని మాయం చేస్తుంది. ఖాళీ గా మిగిలిన నీలో కవిత్వమంతాతాలే. మెచ్చుకోలు ఒక్కోసారి దారి తప్పేట్టు చేస్తుంది”. (తెలుగు వెంకటేష్).

కవి సంగమం భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి?

2018 వరకు మూడుతరాల కవిసంగమం ఆ త ర్వాత ఊరూరా కవిసంగమం కార్యక్రమాలు పదహారు చోట్ల చేసాం. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. అవి కంటిన్యూ చేయాలి. ఈ 13 ఏండ్లలో మూడు మాత్రమే పోయెట్రీ ఫెస్టివల్స్ చేసాం. ప్రతీయేటా పోయెట్రీ ఫెస్టివల్స్ చేయడం అవసరం అనిపిస్తోం ది. కాలమ్స్‌గా వచ్చిన వ్యాసాలతో కొన్ని పుస్తకాలు ఇదివరకే వచ్చాయి. పుస్తకాలుగా రావాల్సినవి ఉన్నాయి. అవి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. కవిత్వ పుస్తకాల పంపిణీ విషయంలో ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. అనేక ప్రాంతాల్లో కవిత్వాన్ని కొరియోగ్రఫ్ చేస్తున్నారు. ఒక దీర్ఘ కవితను కొంతమంది కలిసి పేరాల పద్ధతిలో చదివే ప్రయో గం ఆమధ్య బెంగళూరులో చూసాను. పాడే పద్ధతిలో, డైలాగ్ చెప్పే తీరులో ఇప్పటికి మలయాళ కవులు కవిత్వం చదువుతారు. ఒక కవి తన సెలెక్టడ్ కవితలు వినిపించే కార్యక్రమాలు మనదగ్గర కొన్ని జరిగాయి. అవి ఇంకా పెరగాలి. ఒక హాల్ లో జరిగే కవిత్వ కార్యక్రమాలకు భిన్నంగా ప్రకృతితో మమేకమై కవిత్వసభల జరిపే కార్యక్రమాలు పెరగాలి. యాంబియన్స్ కూడా ముఖ్యం అనేది నా ఉద్దేశ్యం. కవిత్వం కేవలం రాయడం, చదవ డమే గాక వినడం, చూడడం, ఆస్వాదించడం, మమేకమవడం. రాతలకు జీవం పోయడం. అటువంటి కార్యక్రమాలు చేపట్టాలని ఉంది.

Kavi sangamam

కవి యాకూబ్‌తో విమల సంభాషణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News