Friday, December 20, 2024

ములాయం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన క‌ల్వకుంట్ల‌ క‌విత‌

- Advertisement -
- Advertisement -

 

Kavita and KCR for Mulaym Singh Yadav's last rites

సైఫాయి:   స‌మాజ్ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ములాయం సింగ్ యాద‌వ్ అనారోగ్య కార‌ణాల‌తో సోమ‌వారం మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం యూపీలోని ములాయం స్వ‌గ్రామం సైఫాయిలో ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌రగాయి. ములాయం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రు కానున్న‌ట్లు సోమ‌వార‌మే కెసిఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో యూపీ చేరుకున్న కెసిఆర్ కాసేప‌టి క్రితం సైఫాయి చేరుకున్నారు. కెసిఆర్ వెంట యూపీకి ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు వెళ్లారు. వారిలో కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా ఉన్నారు. త‌న తండ్రితో క‌లిసి ములాయం అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రవుతున్న‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. తండ్రితో క‌లిసి సైఫాయి చేరుకున్న త‌మ వీడియోను కూడా  పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News