హైదరాబాద్: ఎంఎల్ సి కవిత, మంత్రి కెటిఆర్ స్నేహితుల కంపెనీకే ఓఆర్ఆర్ లీజు దక్కిందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కంపెనీ టెండర్ వేసిన మొత్తం కంటే ప్రభుత్వం ఎక్కువ చెప్పిందని రఘునందన్ తెలిపారు. ఐఆర్ బి కంపెనీ రూ. 7,272 కోట్లకు మాత్రమే టెండర్ వేసిందన్నారు. టెండర్ ద్వారా రూ. 7,380 కోట్లు వస్తోందని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని రఘనందన్ గుర్తుచేశారు.
బిడ్ వేసిన మొత్తం కంటే ఐఆర్ బీ ఎందుకు ఎక్కువ ఇస్తోందని ప్రశ్నించారు. బిడ్ ఓపెన్ తర్వాత బేరమాడి ఐఆర్ బి ఇన్ ఫ్రాకు లీజు ఇచ్చారా..? ఏప్రిల్ 11న ఓపెన్ చేసిన బిడ్ ను ఏప్రిల్ 27 వరకు వెల్లడించలేదని ఆయన ప్రశ్నించారు. టెండర్లను ప్రజల ముందు ఎందుకు బహిర్గతం చేయలేదన్నారు. 30 ఏళ్లల్లో వచ్చే ఆదాయాన్ని లెక్కగట్టి లీజుకు ఇవ్వాలి కదా? క్రిసిల్ అనే సంస్థ రిపోర్టు ప్రకారం ఎందుకు టెండర్లు పలవలేదన్నారు. అదానీ కంపెనీ రూ.13 వేల కోట్లకు టెండర్ వేసేందుకు సిద్ధమైందని రఘునందన్ తెలిపారు.