Sunday, December 22, 2024

కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కవిత అరెస్టుపై బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కవిత అరెస్టును కెసిఆర్ ఖండించలేదు.. ప్రధాని మోడీ సమర్థించలేదని సిఎం పేర్కొన్నారు. కవిత అరెస్టుపై మోడీ, కెసిఆర్ ల మౌనం వెనుక వ్యూహమేంటి? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి పెద్ద డ్రామాకు తెరలేపారన్నారు. కక్ష సాధింపు చర్యలు ఉండవు.. తప్పులు చేసినవారిని క్షమించం అన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని బిఆర్ఎస్ చెబుతోంది.. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బిజెపి అంటోంది. ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా? అని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

బిఆర్ఎస్, బిజెపి కుట్ర చేస్తే తప్పా.. వారు అనుకుంటున్న కార్యచరణ అమలు కాదన్నారు. రాష్ట్రానికి మోడీ చేసిందేమీ లేదని సిఎం స్పష్టం చేశారు. ప్రధానిగా మోడీ చౌకబారు ప్రకటనలు చేయడం సరికాదని సిఎం రేవంత్ సూచించారు. తెలంగాణను అవమానించిన మోడీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అవినీతిపాలనపై ఒక్క కేసు నమోదు చేయలేదన్నారు. కాళేశ్వరం న్యాయవిచారణకు ఆదేశించామని చెప్పారు. ఎన్డీఎస్ ఏ నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికలను రిఫరెండమ్ గా భావిస్తున్నామని సిఎం రేవత్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News