Wednesday, January 29, 2025

కవిత అరెస్ట్ అక్రమం.. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అక్రమ అరెస్ట్ అని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులులు మండిపడ్డారు. అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తా లో బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, మోడీ కి వ్యతిరేకంగా కార్యకర్తలు  నినాదాలు చేశారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి , సీనియర్ నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, వంగ నాగి రెడ్డి, ఐదు మండలల ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొని మాట్లాడారు.

కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, బిజెపిలో చేరితే అన్ని కేసులు మాయమవుతాయి. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడితే లేని కేసులు నమోదవుతాయని మండిపడ్డారు. ఇడి, సిబిఐ కేసులున్న కరుడుగట్టిన నేరస్తులెందరినో బిజెపి ప్రభుత్వం వదిలేసిందన్నారు. మర్డర్ కేసులున్న వారు బిజెపి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారన్నారు. ఏ నేరం నిరూపణ కాకున్నా సరే, కవితను అరెస్టు చేశారని, విచారణకు కవిత అన్ని విధాలా సహకరించారు. ఫోన్లు ఇవ్వమన్నా ఇచ్చి వచ్చారని చెప్పారు. ఓవైపు కవిత పిటిషన్ సుప్రీం విచారణలో ఉంది. అందులో ఏ నిర్ణయమూ ఇంకా వెలువడలేదు ఆయినా సరే, అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు.

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో మోడీ అన్ని హద్దులు చెరిపేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్టు చేయడం ద్వారా బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని నోటిఫికేషన్ ఇచ్చే ఒకరోజు ముందు అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏంటనీ వారు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయాలని రాష్ట్ర బిజెపి నాయకులు చేసిన డిమాండ్ కు ఇడి స్పందించడం ఏంటి? ఇడి, సిబిఐలను బిజెపి నడుపుతుందా? అవి స్వతంత్ర సంస్థలా? అని ఏద్దేవా చేశారు.

బిఆర్ఎస్ కి అరెస్ట్ లు ఉద్యమాలు కొత్త కాదు అని, మాది పోరాడే గుణం ఉన్న పార్టీ, ఇలాంటి బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. న్యాయ పరంగా పోరాటం చేస్తాం.. ప్రజల తరుఫున మా పార్టీ పోరాటం కొనసాగుతోందన్నారు. నరేంద్రమోడీ, రేవంత్ రెడ్డి కలిసి ఈ కుట్ర చేశారు. బిజెపి, కాంగ్రెస్ ఒక్కటై బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి కుట్రకు మరొకరు సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి యువజన మహిళా ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు కమిటీ సభ్యులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News