Monday, December 23, 2024

ఆటా మహాసభల్లో పాల్గొననున్న కవిత

- Advertisement -
- Advertisement -

Kavitha attended in American Telugu Association

హైదరాబాద్:  అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2 న ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత అతిధిగా హాజరుకానున్నారు. అనంతరం ఇదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాదిగా వలంటీర్లు వివిధ ఏర్పాట్ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి ఇందుకోసం శ్రమిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News