Sunday, December 22, 2024

కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు మే6కు వాయిదా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై గురువారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఈ నెల 6కి కోర్టు వాయిదా వేసింది. ఇబి, సిబిఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును ఈ నెల 6న వెలువరిస్తానని జడ్జి కావేరి బవేజా తెలిపారు. మే 7తో కవిత జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఇడి అధికారులు గత నెల 15న అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమె, తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రౌస్ అవెన్యూ కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News