Sunday, November 17, 2024

కవితకు మళ్లీ నిరాశే..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇడి, సిబిఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కవిత బెయిల్ పిటిషన్లపై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరగ్గా, తీర్పును మే 2 గురువారంకు రిజర్వ్ చేసింది.

గురువారం విచారణ సంద ర్భంగా మే 6వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ కేసులో కవితను మార్చి 15న ఇడి అరెస్ట్ చేయగా ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. ’మహిళగా కల్వకుంట్ల కవిత బెయిల్‌కు అర్హురాలు. ఆమె అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి సాక్ష్యం లేదు. కవిత అరెస్ట్‌కు సరైన ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారు’ అంటూ కవిత తరఫు న్యాయ వాది సింఘ్వి వాదించారు.

ఇడి కస్టడీలో ఉండగానే ఎందుకు సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారని, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. తమ రాజకీయ పార్టీకి కవిత స్టార్ క్యాంపెయినర్ అని, ఇప్పుడు ఆమె ప్రతిపక్షంలో ఉన్నారని వాదించారు. ఆమె పార్టీ రూలింగ్‌లో ఉన్నప్పుడే కేసును ప్రభావితం చేయలేదని గుర్తు చేశారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఉన్న కేసులో అరెస్ట్ అవసరం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో సిబిఐ తన వాదనలు వినిపించింది. లిక్కర్ కేసును కవిత ప్రభావితం చేయగలరని వాదించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం కూడా ఉందని కోర్టుకు వెల్లడించారు. ఈ కేసులో కవిత కింగ్ పిన్ అని, కవితకు బెయిల్ ఇవ్వొద్దన్నారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా, మే 6కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News