కామారెడ్డి: నిన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ ఎందుకు ఏడ్చాడని ఎంఎల్‌సి కవిత ప్రశ్నించారు. బండి సంజయ్ యాదాద్రికి వెళ్లి దొంగ ప్రమాణం చేశారని దుయ్యబట్టారు. ఎల్లారెడ్డి పేటలో జరిగిన టిఆర్‌ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత మాట్లాడారు. ఎంఎల్‌ఎలను కొనడానికి వస్తే అరెస్ట్ చేయొద్దా? అని ప్రశ్నించారు. తెలంగాణలో దొరికితే విచారణ చేయొద్దా? అని కవిత నిలదీశారు. మన మంత్రులను ఇడి, ఐటి పిలిస్తే పోతున్నారని, నెల రోజులుగా మంత్రులపై దాడులు జరుగుతున్నాయని, విచారణ చేసుకోండని, పత్రాలు చూసుకోండని భయపడే ప్రసక్తి మాత్రం లేదని హెచ్చరించారు. తెలంగాణలో ఎవరూ భయపడేవాళ్లు లేరన్నారు. రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. బిఎల్ సంతోష్‌ను విచారణకు సుప్రీం కోర్టు రమ్మంటే ఎందుకు వెళ్లలేదని చురకలంటించారు. తప్పు చేయకపోతే బిఎల్ సంతోస్ భయమెందుకని అడిగారు. రాజకీయంగా గట్టిగా ఉన్నవారిని గద్దల్లా ఎత్తుకుపోవాలని బిజెపి ప్లాన్ చేస్తుందని మండిపడ్డారు.
రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారు: కవిత
- Advertisement -
- Advertisement -
- Advertisement -