Thursday, January 23, 2025

నా జోలికొస్తే చెప్పుతో కొడతా

- Advertisement -
- Advertisement -

రాజకీయాల్లో ఉన్నవారికి కొంతైనా నీతి, నిజాయితీ ఉండాలి బురద రాజకీయాలు
తప్ప.. మరో పని లేదు వైఖరి మార్చుకోకపోతే ఉరికించి ఉరికించి కొడతాం
నువ్వెక్కడ పోటీ చేస్తే అక్కడికొచ్చి ఓడిస్తా ఎంపి ధర్మపురి అర్వింద్‌పై
తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎంఎల్‌సి కవిత ఎఐసిసి అధ్యక్షుడితో టచ్‌లో
ఉన్నారన్న అర్వింద్ భగ్గు నా పుట్టుక.. శ్వాస.. భవిష్యత్తు అంతా
టిఆర్‌ఎస్సేనని స్పష్టీకరణ బిజెపి నుంచి ఆఫర్లు వచ్చిన మాట
వాస్తవమేనని అంగీకారం తనను మరో షిండేలా
మార్చాలనుకున్నారని ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్:  బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్‌పై టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయి లో ఫైర్ అయ్యారు. ‘బిడ్డా.. ఇంకోసారి నా గురిం చి తప్పుగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలోనే చెప్పుతో కొడతా’ అని హె చ్చరించారు. ఏం తమాషాగా ఉందా? పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావం టూ అరవింద్‌పై విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు మౌ నంగా ఉన్నా.. ఇకపై మాత్రం ఉండనని అన్నారు. ఆయనను ఉరికించి.. ఉరికించి కొడతామన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతున్నానని కవిత అన్నారు. ఇక మీదట అర్వింద్ ఎక్కడ నుం చి పోటీ చేసినా వెంటాడి ఓడిస్తామని ఆమె శపథం చేశారు. శుక్రవారం టిఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ, ధర్మపురిని ఒక రేంజ్‌లో తూ ర్పారబట్టారు. అర్వింద్ బురద లాంటోడని విమర్శించారు. అలాంటి వ్యక్తి మీద రాయి వేస్తే.. ఆ బురద మన మీదనే పడుతుందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ  జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గేతో టచ్‌లో ఉన్నానని ధర్మపురి చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణలను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాల్లో కొంతైనా నీతి, ఉండాలన్నారు. కానీ ధర్మపురికి బురద రాజకీయాలు చేయడం తప్ప మరోపనే లేదని విమర్శించారు. కాంగ్రెస్‌తో టచ్‌లో ఉండాల్సిన ఖర్మ తనకు పట్ట లేదన్నారు. ఆ అవసరం తనకంటే అరవింద్‌కే ఎక్కువ అని అన్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ సహకారంతోనే అరవింద్ గెలిచారన్నారు. ఆ యన యాక్సిడెంటల్‌గా ఎంపి అయ్యారన్నారు. ఒక పార్టీలో ఉండి, మరో పార్టీ మోచేతి నీళ్లు తాగే అలవాటు ఆయనకే ఉందని మండిపడ్డారు. ఆయన మాట్లాడే భా షతో నిజామాబాద్ పరువు పోతోందన్నారు. అలాంటి వ్యక్తి ఎంపిగా కొనసాగుతుండడం ప్రజల ఖర్మగా కవిత అభివర్ణించారు. ఈరోజు తా ను ఎంతో బాధతో ఇలా మాట్లాడుతున్నానని కవిత అన్నారు. ఇంత వర కూ తాను ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.

ఇకపై తన గురించి వ్య క్తిగతంగా మాట్లాడితే మాత్రం ఊరుకోనుది లేదని స్పష్టం చేశారు. తన పు ట్టుక… తన శ్వాస… భవిష్యత్తు..అంతా టిఆర్‌ఎస్సేనని అన్నారు. తెలంగాణ వాసన లేని పార్టీల్లో తానెలా చేరుతానని కవిత ప్రశ్నించారు. తన జీవితం… తాను నమ్మే ఏకైక నాయకుడు కెసిఆర్‌యేనన్నారు. తన రాజకీయ ప్రయాణం ఆయనతోనని కవిత స్పష్టం చేశారు. భాష చూస్తుంటే ఇలాంటి రాజకీయాలు అవసరమా అనిపిస్తోందన్నారు. చాలా బాధేస్తోందన్నారు. తాను సమస్యల మీద మాట్లాడానే తప్ప… వ్యక్తుల మీద ఎపుడూ మాట్లాడలేదన్నారు. కానీ అరవింద్ తీరు చూసి మాట్లాడక తప్పడం లేదన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ తప్పదని ఆమె హెచ్చరించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి అనేది ఉంటుందన్నారు. సిఎం కెసిఆర్‌ను అనరాని మాటలు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అరవింద్‌ది సంకుచిత మనస్తత్వం… ఆయనవి చిల్లర మాటలని మండిపడ్డారు. పార్లమెంట్లో అరవింద్ పెర్ఫార్మెన్స్ జీరో అని కవిత అన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు అవరేజ్‌గా 20 డిబేట్లలో పాల్గొంటే అరవింద్ కేవలం 5 చర్చల్లోనే పాల్గొన్నారు. దీంతో పార్లమెంట్‌లో ఏ ఒక్క అంశం పై గొంతెత్తి మాట్లాడలేదన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏనాడు ప్రశ్నించలేదన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. దీనిపై శనివారం నుంచి పలు పోలీస్ స్టేషన్లలో రైతులు చీటింగ్ కేసులు పట్టబోతున్నారన్నారు. అరవింద్‌ది ఫేక్ డిగ్రీఅని… దీనిపై రాజస్థాన్ యూనివర్సిటీకి ఫిర్యాదు చేస్తానని కవిత పేర్కొన్నారు. అలాగే ఫేక్ సర్టిఫికెట్లపై ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

బిజెపి ఆఫర్లు వచ్చిన మాట వాస్తవమే

తనకు బిజెపి నుంచి ఆఫర్లు వచ్చిన మాట నిజమేనని కవిత అంగీకరించారు. మహరాష్ట్రలో షిండే తరహాలో తెలంగాణలో అమలు చేయడంపై తనతో బిజెపి పెద్దలు మాట్లాడారన్నారు. అయితే తెలంగాణలో షిండే మోడల్ నడవదని చాలా స్పష్టంగా చెప్పానని అన్నారు. ఇందులోజై మోడీ అన్న వారిపై ఇడి దాడులు ఉండవన్నారు. నై మోడీ అన్న వారిపై దాడులు జరుగుతాయన్నారు. అందుకే లిక్కర్ స్కాంలో తనను ఇరికేందుకు తెరచాటు ప్రయత్నాలు జరుగుతున్నాయోనని వ్యాఖ్యానించారు. దీనిపై ఇడి ఎలాంటి నోటీసులు తనకు అందలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా కవిత చెప్పారు. ఒక వేల దర్యాప్తు సంస్థల నుంచి తనకు నోటీసులు అందితే తప్పకుండా వారికి సహకరిస్తానని ఆమె స్పష్టం చేశారు. అయితే ఇడి, ఐటి, సిబిఐలు నరేంద్రమోడీకి అల్లుళ్లుగా మారాయని లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడో చెప్పారని ఈ సందర్భంగా ఆ మె గుర్తు చేశారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలకు తాము భయపడేది లేదని అన్నారు. ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లోకి వెలుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News