Monday, December 23, 2024

పిచ్చెక్కి మొరగకు రేవంత్: కవిత

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనకు వంద ఎకరాలు కాదు కదా వంద గజాలు ఉన్నట్లు నిరూపిస్తావా? అని బిఆర్ఎస్ ఎంపి మాలోత్ కవిత సవాలు విసిరారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కవిత రీకౌంటర్ ఇచ్చారు. మానుకోటలో తాను భూకబ్జాలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయసన్యాసం తీసుకుంటానన్నారు. మరి నిరూపించకుంటే అదే అంబేద్కర్ సెంటర్ లో ముక్కు నేలకు రాస్తావా? అని ప్రశ్నించారు. గిరిజన మహిళా ప్రజాప్రతినిధి అంటే అంత చులకనగా కనిపిస్తున్నానా? ఏం ఆరోపించినా చెల్లుబాటవుతుందనే గర్వమా? అని నిలదీశారు.

నోరు అదుపులో పెట్టుకోకుంటే కర్రుకాల్చి మూతిమీద వాతపెడుతానని కవితా హెచ్చరించారు. రేవంతు “నువ్వెంత..! నీ..బతుకెంత అని కవిత కడిగిపారేశారు”. మహానీయుడు సిఎం కెసిఆర్ గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డిది కాదని, రేవంత్ ఏదో..ఊహించుకొని వస్తే నిన్ను..కాంగ్రెస్ పార్టీని.. పట్టించుకునే నాథుడే లేడన్నారు. పిచ్చెక్కి మొరుగుతున్నావని, జాగ్రత్త… ఏది పడితే అది వాగకు… ప్రజలు అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు. దొంగే.. దొంగ..దొంగ అన్నట్లు.. రేవంత్ మరి ఎక్కువ చేస్తే ప్రజలు తరిమికొట్టే ప్రమాదం కూడా ఉందని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News