Monday, December 23, 2024

బండి వర్సెస్ కవిత మధ్య ట్విట్టర్ వార్

- Advertisement -
- Advertisement -
ఆడబిడ్డ తలుచుకుంది…ఇక మీ అడ్రస్ గల్లంతే అని కౌంటర్

హైదరాబాద్:  బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండి సంజయ్ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. దీనికి కవిత అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలకు తండ్రి లా, అన్నలా, తమ్ముడిలా, మేనమామలా మొత్తానికి మహిళా సంరక్షుడిగా సిఎం కెసిఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. మహిళా సంక్షేమానికి బిఆర్ ఎస్ ప్రభుత్వం కట్టుబడి వుందని, కంటికి రెప్పలా వారిని కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు.

మహిళా సాధికారత కోసం విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టిన తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళ సంక్షేమ దినోత్సవ వేడుకలు జరిగాయి. అయితే ఈ దినోత్సవంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. ’గవర్నర్‌కు దక్కదు గౌరవం, ఆడబిడ్డలకు లేదు అండ, గిరిజన మహిళలపై పోలీస్ గిరీ, బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం, ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం, అదిరింది కెసిఆర్ నీ మహిళా సంక్షేమం’ అంటూ సంజయ్ ట్వీట్ చేశారు.

ఇలా సిఎం కెసిఆర్‌పై సంజయ్ చేసిన కామెంట్స్‌కి ఎంఎల్‌సి కవిత అదే ట్విట్టర్ వేదికగా కౌంటరిచ్చారు. ’పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం, దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బిజెపి ఎంపిపై చర్యలు ఉండవు, దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం, నినాదాలకే పరిమితమైన భేటీ బచావో… భేటీ పడావో, సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్‌లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి, మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం, ఆడ బిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం., ఆడబిడ్డ తలుచుకుంది .. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది’ అంటూ కవిత సంజయ్‌కు సమా ధానమిచ్చారు.

ఇక మహిళా సంక్షేమానికి కెసిఆర్ ఏం చేస్తున్నారో కవిత వివరించారు. ఆడపిల్లల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్ పథకాల ద్వారా డబ్బులిచ్చిన కెసిఆర్ ఇంటిపెద్దలా మారారన్నారు. ఇక బాలింతలకు కెసిఆర్ కిట్ ఇచ్చి మేనమామలా, న్యూట్రీషన్ కిట్ ఇచ్చి డాక్టర్‌లా, ఆరోగ్యలతో ఆరోగ్యదాతగా, షీ టీమ్ ద్వారా సంరక్షుడిగా సిఎం కెసిఆర్ మారారని కవిత అన్నారు. మొత్తంగా తెలంగాణ ఆడబిడ్డలకు తండ్రి, అన్న, తమ్ముడు, మేనమామ ఇలా అన్నీ తానేఅయి కెసిఆర్ అండగా నిలుస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News