- Advertisement -
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 10 రోజుల ఇడి కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్నారు ఇడి అధికారులు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిపి విచారించేందుకు ఇడి అధికారులు మరో రెండు రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది.
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసి వారం రోజులపాటు కస్టడీ తీసుకున్న ఇడి అధికారు.. అనంతరం కోర్టులో హాజరుపర్చి మరో మూడు రోజులు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక, కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఇడి అధికారులు అరెస్టు చేశారు. అరెస్టు కంటే ముందు ఎనిమిదిసార్లు కేజ్రీవాల్ కు నోటీసులు పంపించారు ఇడి అధికారులు. ప్రస్తుతం కేజ్రీవాల్ వారం రోజులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.
- Advertisement -