- Advertisement -
ఢిల్లీ: బిఆర్ఎస్ నాయకురాలు కె. కవితకు మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది. కస్టోడియల్ ఇంటరాగేషన్ కోసం ప్రత్యేక జడ్జీ కావేరీ బవేజా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కవిత న్యాయవాది నితేశ్ రాణా ఆమె కుమారుడి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాత్యాలిక బెయిల్ ఇవ్వాలని వాదించినా ప్రయోజనం లేకుండా పోయింది. కోర్టు తాత్కాలిక బెయిల్ విచారణను తిరిగి ఏప్రిల్ 1న చేపట్టనున్నది. ఇదిలావుండగా బిఆర్ఎస్ ఎంఎల్ సి కవిత దీనిపై స్పందిస్తూ ‘‘ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, కాకపోతే రాజకీయ లాండరింగ్ కేసు. అల్లిన తప్పుడు కేసు. మేము నిష్కలంకంగా బయటికి వస్తాము’’ అన్నారు.
- Advertisement -