Monday, December 23, 2024

కవితకు జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: సిబిఐ ప్రత్యేక కోర్టులో ఎంఎల్‌సి కవితకు ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. నేటితో ఎంఎల్‌సి కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు అధికారులు హాజరుపరిచారు. జులై 5వరకు కస్టడీ పొడిగిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జూన్ 21వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. జూన్ 3న ఈడీ అధికారులు వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని జూలై 3వ తేదీ వరకు పొడిగించిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News