- Advertisement -
నిజామాబాద్: సిఎం కెసిఆర్ ఆశీర్వాదంతో ఏడాదిలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని ఎంఎల్‌సి కవిత తెలిపారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల టిఆర్ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 90 శాతం మంది టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఉన్నారని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎంఎల్‌సిగా మరోసారి అవకాశం ఇచ్చిన సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -