Friday, December 20, 2024

ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన మాజీ మంత్రులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్ర కార్యాలయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతుంది. ఈడీ అధికారులు కవిత విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. బిఆర్ఎస్ మాజీ మంత్రులు కెటిఆర్‌, హరీష్‌రావు, ప్రశాంత్ రెడ్డి కవితను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు భారత రాష్ట్ర సమితి శాసనసభ్యురాలు కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏడు రోజుల కస్టడీకి అప్పగించింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె కవితను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆమె ఇంటి నుండి ఇడి అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News