Tuesday, December 24, 2024

ఇడి కార్యాలయానికి చేరుకున్న కవిత

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో ఎంఎల్‌సి కవిత ఇడి ఎదుట రెండోసారి హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి ఇడి కార్యాలయంలో విచారణ జరుగుతోంది. గత వారం ఇడి నోటీసులు జారీ చేసిన కాని కవిత హాజరు కాలేదు. సోమవారం రావాలని కవితకు ఇడి తాఖీదులు పంపింది. ఇడి నోటీసుల మేరకు కవిత హాజరవుతున్నారని బిఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇడి నోటీసుల జారీపై ఇప్పటికే కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

కవిత పిటిషన్‌పై ఈ నెల 24న సుప్రీం విచారణ జరపనుంది. కవితతో పాటు ఆమె భర్త, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. పిఎంఎల్‌ఎ సెక్షన్ 50 కింద కవితను ఇడి ప్రశ్నించనుంది. మనీలాండరింగ్ కేసులో కవిత అనుమానితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సౌత్ గ్రూప్ నుంచి కవిత కీలక వ్యక్తిగా ఇడి పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్ సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఇడి ప్రశ్నించనుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్ సహా మిగిలిన డాక్యుమెంట్లను కవిత అందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News