Monday, January 20, 2025

కవిత విడుదల

- Advertisement -
- Advertisement -

షరతులతో మంజూరు చేసిన సుప్రీంకోర్టు 
మూడు ప్రధానమైన కారణాలను ప్రస్తావించిన అత్యున్నత ధర్మాసనం
సిబిఐ తుది చార్జిషీట్ దాఖలు, ఇడి దర్యాప్తు పూర్తి కావడం, మహిళగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కోర్టు వ్యాఖ్యలు

పిఎంఎల్‌ఎలోని సెక్షన్ 45 ప్రకారం ఓ మహిళగా ప్రత్యేక లబ్ధి పొందేందుకు ఎంఎల్‌సి కవిత అర్హురాలు. 45(1) ప్రోవిజన్ మహిళలకు ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుంది. చదువుకున్న, ఆధునిక మహిళకు బెయిల్ ఇవ్వడం కుదరదని ఢిల్లీ చేసిన వ్యాఖ్యలు విడ్డూరం. హైకోర్టు ఆదేశాలను చట్టంగా అనుమతించలేం. ఎంపి అయినా, సాధారణ వ్యక్తి అయినా… న్యాయం అందరికీ ఒకటే
సుప్రీంకోర్టు

మన తెలంగాణ/హైదరాబాద్:  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న బి ఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు మంగళవారం బె యిల్ లభించింది. ఆమెకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కవితను అరెస్టు చేసి మంగళవారానికి 164 రోజులు కా గా, జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె 153 రోజులు తీహార్ జైలులో ఉన్నారు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

బెయిల్ పిటిషన్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరువైపుల వా దనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మం జూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇడి, సిబిఐ రెండు కేసుల్లోనూ ఆమెకు బెయిల్ ఇచ్చింది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది.బెయిల్ మంజూరు చేయడానికి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాధన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మూడు ప్రధాన కారణాలను ప్రస్తావించింది.

లిక్కర్ కేసులో ఇడి దర్యాప్తు పూర్తయిందని, సిబిఐ తనఫై నల్ ఛార్జిషీట్‌ను ట్రయల్ కోర్టులో సమర్పించిందని, మనీలాండరింగ్ చట్టంలో మహిళకు ఉన్న ప్రత్యేక వెసులుబాటును పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించిన బెంచ్ ఆమెను ఇకపైన జై ల్లో ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఎంఎల్‌సి కవిత ఇడి, సిబిఐ కేసుల్లో రూ. 10 లక్షల చొప్పున ష్యూరిటీని సమర్పించాలని, పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. జరిగే విచారణకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, బెయిల్‌పై ఉన్న సమయంలో సాక్షుల్ని ప్రభావితం చేయరాదని, సా క్ష్యాల్ని తారుమారు చేయరాదని, ఇలాంటి షరతులను సుప్రీంకోర్టు విధించింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఇడి తరపున ఎఎస్‌జి రాజు వాదనలు వినిపించారు.

కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయని తెలిపారు. ఇడి, సిబిఐ కేసు లో ఇప్పటికే విచారణ పూర్తయ్యిందని కోర్టుకు విన్నవించారు. ఇడి కేసులో 5 నెలలుగా, సిబిఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారని చెప్పారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల వి చారణ ముగిసిందన్నారు.

కేసులో ఛార్జ్‌షీట్లు కూ డా దాఖలు చేశారని వెల్లడించారు. రూ.100 కో ట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని అన్నారు. దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని చెప్పారు. ఫోన్లు మార్చడంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని కానీ దాన్ని రికవరీ చేయలేదని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఇడి అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. అప్పటినుంచి జ్యుడిషియల్ రిమాండ్, కస్టడీలో భాగంగా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు బెయిల్ లభించిన తర్వాత కవితకు సైతం అదే తీరులో ఉపశమనం లభించడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News