Sunday, January 12, 2025

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి: 47 పార్టీలకు కవిత లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ నెలలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం పొందేందుకు సమైక్యంగా సహకరించాలని కోరుతూ బిజెపి, కాంగ్రెస్‌తో సహా 47 రాజకీయ పార్టీలకు బిఆర్‌ఎస్ నాయకురాలు, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మంగళవారం విజ్ఞప్తి చేశారు.

రాజకీయ విభేదాలను పక్కనపెట్టి మహిళా రిజర్వేషన బిల్లు ఆమోదం పొందేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయా రాజకీయ పార్టీలకు విడివిడిగా రాసిన లేఖలో ఆమె పిలుపునిచ్చారు. చట్టసభలలో మహిళలకు అధిక ప్రాధాన్యం మరింత సమాన, సమతుల్య రాజకీయ వేదికను నిర్మించగలదని ఆమె పేర్కొన్నారు. భారతీయ రాజకీయ రంగంలో మహిళలు పోషిస్తున్న ప్రధాన భూమికను ఆమె గుర్తు చేస్తూ చట్ట సభలలో వారికి మరింత ప్రాధాన్యలం లభించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

ప్రజా జీవితంలో ఇప్పటికే 14 లక్షల మంది మహిళలు తాము కూడా అత్యంత సమర్థంగా పరిపాలచగలమని నిరూపించుకున్నారని ఆమె తెలిపారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉద్దేశించిన రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News