Friday, December 20, 2024

నేను కేసీఆర్ బిడ్డను.. వడ్డితో సహా చెల్లిస్తా: కవిత వార్నింగ్

- Advertisement -
- Advertisement -

తీహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను అన్యాయంగా జైల్లో పెట్టినవారికి వడ్డితో సహా చెల్లిస్తానని కవిత వార్నింగ్ ఇచ్చారు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం కాసేపటి క్రితం కవిత జైలు నుంచి విడుదల అయ్యింది. ఈ సందర్భంగా కుబుంబ సభ్యులను కౌగిలించుకుని కవిత ఎమోషన్ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత… పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉండటం ఇబ్బందికర విషయం. నేను కేసీఆర్‌ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. మొండిదాన్ని.. మంచిదాన్ని. అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. చట్టబద్ధంగా నా పోరాటం కొనసాగిస్తా. క్షేత్ర స్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తాం’’ అని కవిత వార్నింగ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News